Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫైనల్ వారానికి ముందు... బిగ్ బాస్-4 నుంచి ఎలిమినేట్ అయిన మోనాల్!

Monal Eliminated from Bigg Boss Telugu
  • అభిజిత్, అరియానాలకు పుష్కలంగా ఓట్లు
  • డేంజర్ జోన్ లో ఉన్న హారిక, మోనాల్
  • మోనాల్ వచ్చేసిందంటున్న సోషల్ మీడియా
టాలీవుడ్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తుది దశకు వచ్చేసింది. మరో ఎనిమిది రోజుల్లో సీజన్ ముగియనుంది. నేడు చివరి ఎలిమినేషన్, ఆపై హౌస్ లో మిగిలేది టాప్-5 కంటెస్టెంట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో నేడు ఎలిమినేట్ ఎవరు కానున్నారన్న విషయం సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. ఈ వారం మోనాల్ హౌస్ నుంచి బయటకు రానున్నదట. మూడవ వారంలోనే మోనాల్ బయటకు వస్తుందని వార్తలు వచ్చినా, ఆమె టాలెంట్ ను చూసిన బిగ్ బాస్ సేవ్ చేశాడన్న పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆపై కూడా ఆమె చాలా సార్లు ఎలిమినేషన్ జాబితాలో ఉండి కూడా తప్పించుకుంటూ వచ్చింది. ఇక ఈ వారం ఆమె షో ముగిసిందని సమాచారం. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఆరుగురిలో అభిజిత్ కు తాను సాధించిన టికెట్ టు ఫినాలే కారణంగా ఏ మాత్రం ఆందోళన లేకుండా చివరి క్షణాల వరకూ ఆనందించే మూడ్ లో ఉన్నాడు. ఇక, అఖిల్ కోసం ఫినాలే మెడల్ ను త్యాగం చేసిన సోహైల్ కూడా నిన్నటి ఎపిసోడ్ తరువాత టాప్ 5లోకి వెళ్లిపోయాడు.

ఆపై మిగిలిన నలుగురు అభిజిత్, అరియానా, దేత్తడి హారిక, మోనాల్. వీరిద్దరిలో అభిజిత్, అరియానాలకు ఇప్పటికే పుష్కలంగా ఓట్లు పడ్డాయి. ఎటొచ్చీ హారిక, మోనాల్ లకు మాత్రం ఓట్లు తక్కువగా ఉన్నాయి. నేడు జరిగే ఎలిమినేషన్ ఎపిసోడ్ లో హారికను సేఫ్ అయినట్టుగా ప్రకటించే నాగ్, మోనాల్ ను బయటకు తీసుకుని రానున్నాడని తెలుస్తోంది.

ఇక మోనాల్ కు గతంలో ఎన్నోమార్లు తక్కువ ఓట్లు వచ్చాయన్న సంగతి తెలిసిందే. ఆమెను కాపాడేందుకు కుమార్ సాయి, అవినాష్ వంటి బలమైన పోటీదారులను బలి పశువులను చేశారని కామెంట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నాగ్ స్వయంగా తెరపైకి వచ్చి, కంటెస్టెంట్ల ఎలిమినేషన్ కేవలం ఓటింగ్ ఆధారంగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే తామేమీ దాన్ని నమ్మడం లేదని వెంటనే కామెంట్లు కూడా రావడం గమనార్హం.

ఇక బిగ్ బాస్ హౌస్ మిగిల్చిన బాధలను, అపనిందలను వెంటబెట్టుకుని మోనాల్ నేడు బయటకు వచ్చి, తన మనసులోని బాధను నాగ్ తో పంచుకోనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్టు తెలుస్తోంది. అయితే, ఇక్కడో ట్విస్ట్ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తనకెంతో ఇష్టమైన మోనాల్ కోసం హారికను బయటకు పంపే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇక ఏం జరుగుతుందన్న సంగతి తెలియాలంటే, మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Bigg Boss
Monal
Harika
Elimination
Abhijit

More Telugu News